ఫ్లాష్: గుడ్ న్యూస్..తెలంగాణాలో మరో రెండు నోటిఫికేష‌న్స్ విడుదల..

0
90

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలయిపోయింది. మొన్న కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భ‌ర్తీకి, నిన్న గ్రూప్ -1 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే. నిరుద్యోగులకు తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో తీపి క‌బురు చెప్పింది. తాజాగా ఎక్సైజ్, ర‌వాణా శాఖ‌లో 677 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేసి చక్కని అవకాశం కల్పించింది.  ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ 6 పోస్టులు, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్‌ 57 పోస్టులు, ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ 614కు పోస్టులను వెలువరించింది. మే 2వ తేదీ నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది.