ఎండలు మాములుగా లేవు దారుణంగా ఉంటున్నాయి, అయితే మనం ఇలా మాడిపోతున్నాం ఇక జంతువులకి కూడా ఇలాగే ఉంది.. పాపం నీరు కూడా లేక ఇబ్బందులు పడుతున్నాయి.. భానుడి ప్రతాపం జంతువులు మనుషులపైనే కాదు మొక్కలపై కూడా చూపిస్తోంది…ఇక నీరు ఎక్కువగా తీసుకునే మొక్కలు అయితే దారుణమైన స్దితిలో ఉంటున్నాయి. నీరు లేక ఎండిపోతున్నాయి.
అయితే ఇక అరటి పంటకి కూడా నీరు ఉండాలి అతిగా ఎండ తగిలితే అరటి మొక్క చనిపోతుంది.
ఎండల నుంచి కాపాడుకునేందుకు మనుషులు గొడుగులు, క్యాపులు వినియోగిస్తున్నారు. మరి జంతువులు కూడా ఆ నీడన ఉంటాయి.. మరి మొక్కలకు ఏమిటి అంటే ఆ ఎండకు అవి అలాగే ఉంటాయి.
అందుకే రైతు కాస్త ఆలోచన చేశాడు.. అరటి మొక్కలను కాపాడేందుకు ఓ ఐడియా వేశాడు.. ఆ మొక్కలకు గొడుగులు ఏర్పాటు చేశాడు….కడప జిల్లా కొండాపురం మండల పరిధిలోని తిమ్మాపురం రైతు కొండారెడ్డి ఈ అరటి మొక్కలకు గొడుగులు పెట్టాడు… మరి ఏ గొడుగులు అని అనుకుంటున్నారా … ఈత ఆకు కొమ్మలతో గొడుగుల్లా ఏర్పాటు చేసి బతికించుకుంటున్నాడు.ఇలా చేయడం వల్ల వాటికి నేరుగా ఎండతగలదు.. అవి బతుకుతాయి ఈ ఐడియా చాలా బాగుంది అంటున్నారు అందరూ.