మొక్కజొన్నలో చీడ పురుగులు వేధిస్తున్నాయా? అయితే ఈ టిప్స్ పాటించండి..

0
98

మనకు నీళ్ల సౌకర్యం లేకపోయినా ఎలాంటి కాలంలో అయినా పండే పంట మొక్కజొన్నమాత్రమే. కరీఫ్ కంటే రబీలో ఎక్కువ దిగుబడి ఉంటుంది. మొక్కజొన్నకేవలం ఆహార పంటగానే కాకుండా దాణా రూపంలోనూ, పశువుల మేతగాను రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఈ పంటను పండించే రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. మొక్కజొన్నలో చీడపీడలను నివారించాలంటే ఇలాంటి మందులు వాడాల్సి ఉంటుంది. తక్కువ దిగుబడితో అధిక లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి.

పంట కోత మే నెల కంటే ముందే వచ్చేలా చూసుకోవాలి. అందుకే పంటను రబీ సీజన్ లో వెయ్యడానికి రైతులు ఎక్కువగా ఆసక్తిచుపుతుంటారు. విత్తనం వేసేటప్పుడు సాలుల మధ్య కనీస దూరం 30-45 సే.మీ, సాలు విత్తనాల మధ్య 20-25 సే.మీ దూరం ఉండేలా చూసుకోవాలి. విత్తనంతోపాటు పైపాటుగా యూరియాను వేసుకోవాలి. ప్రధానంగా మొక్కజొన్న సాగులో చీడపీడల సమస్య అధికంగా ఉంటుంది. రైతులు సరైనా రక్షణ చర్యలు చేపడితే చీడపీడల భారి నుండి పంటను చక్కగా కాపాడుకోవచ్చు. తద్వారా మంచి దిగుబడిని పొందవచ్చు.

మొక్కజొన్నలో వచ్చే చీడపీడలు

కత్తెర పురుగు : ఇది పంటకు సోకిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. లేకుంటే కత్తెర పురుగు తక్కువ వ్యవధిలో పంట మొతాన్ని తినేస్తుంది. దీని నివారణకు 1 లీటర్ నీటిలో 5 మీ.లీ వేపనునే కలుపుకొని పిచికారి చేసుకోవాలి. లేదా 1 లీటర్ నీటిలో 3 మీ.లీ స్పెనోశాడ్ లేదా ఇమమెక్టిమ్ బెంజోయేట్ 4 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చెయ్యాలి. నివారణ కోసం రసాయన మందులను పిచికారి చేసేప్పుడు ఉదయం సమయంలో లేదా సాయంత్ర సమయాల్లోనే చెయ్యడం మంచిది.

పేను బంక: మొక్కజోన్నలో పేనుబంక రసం పీల్చడం వల్ల మొక్క పెరుగుదలను దెబ్బ తీస్తుంది. పొడి వాతావరణంలో మరియు మొక్కకు నీటి ఒత్తిడి ఉన్నప్పుడు పెనుబంక ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మొక్క లేత ఆకు నుండి రసం పీల్చడం వల్ల మొక్క నిరసనగామరి ఆకులు ఆకుపచ్చ రంగు నుండి పసుపుపచ్చ రంగులోకి మరుతాయి. దీని నివారణకు మోనోక్రోటోఫోస్ 1.5 మీ.లీ. లేదా డైమీతోయేట్ 2 మీ.లీ. లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటరు నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి.

కాండం తొలుచు పురుగు : రబీలో దీని వ్యాప్తి అధికంగా ఉంటుంది. ఈ పురుగు వల్ల పంట 65% వరకు దిగుబడి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ పురుగు మొక్క కాండంపై మరియు మొక్కజొన్న పొత్తులపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. దీని నివారణకు మోనోక్రోటోఫాస్ 1.5 మీ.లీ 1 లీటరు నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. కాండంతొలుచు తెగులు ఉద్ధృతి ఎక్కువగా ఉంటే కర్బోఫ్యూరాన్ త్రీజీ గుళికలను ఎకరానికి 3 కిలోలు మొక్కజొన్న ఇగురులో వేసుకోవాలి.