వినాయక చవితి ఉత్సవాల్లో ఈ తప్పు చేస్తున్నారా?

0
109

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో వినాయకచవితి కూడా ఒకటనే విషయం తెలిసిందే. వినాయక చవితి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. రేపు గ్రామాల్లో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. దాంతో ప్రజలు వాడ వాడల గణేషుడి మండపాలు ఏర్పాటు చేశారు.

10 రోజులు అంగరంగవైభవంగా జరుపుకొనే ఈ పర్వదిన సంబరాలు ప్రారంభం అయ్యాయి. గణేష్ చతుర్థి నాడు గణపతిని పూజించేటప్పుడు కొన్ని నియమాలను ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. అవేంటంటే..ముఖ్యంగా గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని చూడటం అశుభం అని భావిస్తారు. అయితే వినాయక చవితి రోజున పొరపాటున మీరు కూడా చంద్రుడిని చూస్తే దోషం నివారణ కోసం ఈ శ్లోకాన్ని పఠించండి..

ఈ దోషం తొలగిపోవాలంటే ముందుగా గణపతిని పూజించి, పూలు, పండ్లు సమర్పించి చంద్రుడికి చూపించి పేదవాడికి దానం ఇవ్వాలి. అదే సమయంలో, భవిష్యత్తులో అపవాదులు రాకుండా ఉండటానికి, పూర్తి భక్తి , విశ్వాసంతో ఈ మంత్రాన్ని పఠించండి.

సింహం ప్రసేనుని చంపగా, సింహాన్ని జాంబవంతుడు చంపాడు. శమంతకమణి కోసం ఓ సున్నిత మనస్కుడా ఏడవకు అనే మంత్రాన్ని పఠించడం వల్ల దోషం తొలగిపోతుంది.