కానిస్టేబుల్ కు ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ టిప్స్ తెలుసుకోండి..

0
114

తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలెర్ట్. దీనికి సంబంధించి ఈనెల 28న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎలాంటి టిప్స్ పాటించాలి? ఇప్పుడు చూద్దాం..

కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ ఐయ్యే అభ్యర్థులకు ముందుగా ప్రిలిమ్స్, తరువాత ఈవెంట్స్, ఇవి క్వాలిఫై ఐతే మెయిన్స్ ఏగ్జామ్ ఉంటుంది. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మొత్తం 200 మార్కులకు ఉంటుంది. అర్థమెటిక్, రీజనింగ్ కలిపి 100 మార్కులు ఇంగ్లీష్ 20 మార్కులకు ఉంటుంది. ఇంకా 80 మార్కులకు తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కరెంట్ అఫైర్స్ మొత్తం కలిపి 80 మార్కులకు ఉంటాయి. ఇందులో 60 మార్కులు వస్తే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి 60 మార్కులు రావాలంటే 5 తప్పులకు ఒక నెగటివ్ మార్కులు ఉంటాయి.

ఈసారి ఇది జాగ్రత్త గా చూసి ఆన్సర్ పెడితేనే 60 మార్కులు సాధించవచ్చు. అప్పుడే ప్రిలిమ్స్ లో మనం విజయం సాధించవచ్చు. 60 మార్కులే కదా చాలా మంది లైట్ గా తీసుకుంటే అప్పుడే వేయిల మంది ఫిల్టర్ అయిపోతారు. సో గత ఎగ్జామ్స్ ను గుర్తుపెట్టుకుని పాత మోడల్ పేపర్స్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని సన్నద్ధం కావాలి. ఈసారి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్ చాలా కఠినంగా ఉండవచ్చు. గత ఎగ్జామ్స్ ను దృష్టిలో పెట్టుకొని పాత మోడల్ పేపర్స్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని సన్నద్ధం కావాలి.