మూగజీవాలకు పెళ్లి విందు ఏర్పాటు చేసిన కొత్త జంట – శభాష్ వీడియో చూడండి

A marriage held at a GOSHALA in Nellore, Andhra by a North Indian fmly at a total cost of just Rs. 65,000 feeding only animals n inmates

0
90

పెళ్లి చేసుకునే జంటలు వందల మందిని పిలిచి గ్రాండ్ గా వివాహం చేసుకుంటారు.వచ్చిన వారికి అందరికి మంచి విందు ఏర్పాటు చేస్తారు. కానీ నేటి యువత కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు, ఇలా ఆలోచించి ఓ జంట చేసిన పనితెలిస్తే నిజంగా శభాష్ అనాల్సిందే. ఒక సదుద్దేశం నెరవేరేలా తమ పెళ్లిని ప్లాన్ చేసుకుంది ఈ జంట.

నెల్లూరుకు చెందిన ఈ కొత్త జంట, పెళ్లి సందర్భంగా మూగజీవాలకు విందు ఏర్పాటు చేసి అందరి అభినందనలు అందుకుంది. నిఖిల్, రక్ష ఇటీవల పెళ్లితో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి వినూత్నంగా ఉండాలి అని భావించారు. అందుకే కుటుంబ సభ్యులకి వీరి ఆలోచన చెప్పారు. అది ఏమిటి అంటే ఓ గోశాలలో జంతువులకి విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ విందులో ఎండుగడ్డి, పచ్చగడ్డితో పాటు రకరకాల పిండివంటలు, ఫలాలను మూగజీవాలకు అందించారు. వీరు చేసిన పనికి అందరూ అభినందిస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సుమారు దీని కోసం రూ.65 వేలు ఖర్చు చేశారు.

ఈ వీడియో మీరు చూసేయండి

https://twitter.com/S_K_Raman/status/1401202746095804424