ఏపీ: తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బుధవారం శ్రీ భోగశ్రీనివాసమూర్తిని ప్రతిష్టించనున్న నేపథ్యంలో ఉదయం అభిషేకం, స్నపనతిరుమంజనం చేపట్టారు. అదేవిధంగా క్షీరాధివాసం నిర్వహించారు. సాయంత్రం విశేష హోమాలు, అష్టబంధనం నిర్వహిస్తారు.
అక్టోబరు 20న ఉదయం 6 నుండి 7 గంటల వరకు మహాశాంతి అభిషేకం, హోమాలు, పూర్ణాహుతి, ఆవాహన అర్చన నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు మహాసంప్రోక్షణ జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ ధనంజయుడు, సూపరింటెండెంట్ శ్రీ రమణయ్య, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.