అత్తగారింటికి కన్నం వేసిన అల్లుడు పెళ్లి కూతురు పట్టించింది ఎలా అంటే

అత్తగారింటికి కన్నం వేసిన అల్లుడు పెళ్లి కూతురు పట్టించింది ఎలా అంటే

0
86

కన్న కూతురిని పెళ్లి చేసి పంపిస్తే వారికి ఉన్నదానిలో అంతో ఇంతో ఇవ్వడం చేస్తారు. తల్లిదండ్రులు కూడా కూతురికి తమకు ఉన్నదానిలో పెడతారని అందరికి తెలిసిందే… కాని అల్లుడు బుద్ది వంకరపోతే ఎవరు ఏం చేస్తారు, కాబోయే అత్తారింటికే కన్నం వేశాడో జామాత.. అదేనండి అల్లుడు. ఇంటిలో తనకు అవసరం అనుకున్న బంగారం నగదు తీసుకుని పారిపోయాడు.

హైదరాబాద్‌, పాతబస్తీలోని కాలాపత్తర్ పరిధిలో జరిగిందీ ఘటన. శాస్త్రిపురం కింగ్ కాలనీకి చెందిన సల్మాన్‌ఖాన్ సేల్స్‌మన్. కాలాపత్తర్‌కు చెందిన యువతితో అతడికి వివాహం నిశ్చయమైంది. దీంతో పెళ్లికి అవసరం అయిన బంగారం బట్టలు అన్నీ కొన్నారు, పెళ్లి కుమార్తె ఈ విషయాన్ని అతనికి చెప్పింది.

వెంటనే సల్మాన్ అవి కాజేయాలి అని అనుకున్నాడు.. ప్రార్థనల కోసం కాబోయే అత్తింటివారు దర్గాకు వెళ్లిన విషయం తెలుసుకున్న సల్మాన్ తన పథకాన్ని అమలు చేశాడు. కిటీకిలు తీసి అక్కడ నుంచి లోపలికి వెళ్లాడు, బీరువాలో 2.20 లక్షల క్యాష్ బంగారం దోచేశాడు.. పోలీసులు సీసీకెమెరాల ఆధారంగా చోరీ చేసింది కాబోయే అల్లుడేనని తేల్చారు. అతడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. గొప్ప అల్లుడే అందుకే పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు.