అత్తవారు బైక్ ఇవ్వలేదు అని పెళ్లికొడుకు రచ్చ రచ్చ- పెళ్లి కూతురు చేసిన పనికి షాక్

అత్తవారు బైక్ ఇవ్వలేదు అని పెళ్లికొడుకు రచ్చ రచ్చ- పెళ్లి కూతురు చేసిన పనికి షాక్

0
95

ఇప్పటికీ కొంత మంది కట్నం లేకపోతే పెళ్లి వద్దు అంటున్నారు… ఇక పెళ్లి అయిన తర్వాత కూడా అదనపు కట్నం కోసం చాలా మంది భార్యలని వేధిస్తున్నారు… ఇక పెళ్లి సమయంలో కట్నాలు కానుకలు లాంచనాలు అన్నీ ఇస్తేనే మూడు ముళ్లు వేస్తాం లేకపోతే కుదరదు అని కొందరు అంటున్నారు…మొత్తానికి ఇప్పుడు ఇలాగే ఓ పెళ్లి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.

 

 

పెళ్లికి బుల్లెట్ బైక్ ఇస్తానని అపాచి బైక్ ఇచ్చారని ఓ పెళ్లి కొడుకు పెళ్లి ఊరేగింపులో నానా హంగామా చేశాడు, అసలు అమ్మాయిలే పెళ్లికి దొరకడం లేదు అని బాధ పడుతుంటే ఏకంగా ఇలా పెళ్లికొడుకు బైక్ కోసం రచ్చ చేయడం అందరికి షాక్ అనిపించింది.

 

తాను అడిగిన బైక్ అత్తింటివారు కట్నంగా ఇవ్వలేదని.. ఏకంగా గుర్రం ఎక్కి ఊరేగింపుగా వస్తున్న వరుడు గుర్రంపై నుంచి దూకేసి పెళ్లి డ్రెస్ విప్పేసి నానా హంగామా చేశాడు. ఇక హత్రాస్ లో ఇది జరిగింది. పెళ్లికి ముందే పెళ్లి కొడుకు ఇలా ఉండటంతో ఇక పెళ్లి కూతురు కూడా తాను ఈ పెళ్లి చేసుకోను అని చెప్పింది. ఇక ఆమె తండ్రి కూడా ఇదే చెప్పాడు చివరకు ఆ బైక్ వివాదం కాస్త పెళ్లి ఆగిపోయేలా జరిగింది.