అతిగా మాస్కులు వాడుతున్నారా…. అయితే ఈ వార్త మీకోసమే

అతిగా మాస్కులు వాడుతున్నారా.... అయితే ఈ వార్త మీకోసమే

0
103

కరోనా కారణంగా మాస్క్ లేనిదే బయటకురాలేని పరిస్థితి…. ఈ నేపథ్యంలో ప్రజల్లో అనేక అపోహాలు ఉన్నాయి… మాస్కులు అతిగా వాడటంవల్ల కలిగే ఇబ్బందులు ఇవే నంటూ కొన్ని వార్తలు సామాజిక మాధ్యమాల్లోనూ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే… మాస్కులు కారణంగా కర్బన్ డయాక్సైడ్ స్థాయి పెరిగి ఊపిరితిత్తుల సమస్యకు దారి తీస్తుందని ప్రచారం చేస్తున్నారు…

అయితే తాజా అధ్యాయణం ఒకటి ఈ వార్తలను ఖండించింది మరీ ముఖ్యంగా మాస్కులు వినియోగం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది… అమెరికాలోని ఒక యూనివార్సిటీ ఈ విషయమై అద్యాయణం చేసింది…

మాస్కులు ధరించడం వల్ల ఆరోగ్యవంతమైన వ్యక్తుల్లో ఆక్సిజన్ కార్బన్ డైయాక్సైడ్ స్థాయిలో మార్పులు జరిగి అనారోగ్యపాలు అవుతారన్న వార్తలలో నిజం లేదని తెలిపింది అయితే అందరిలోనూ అలా జరుగక పోవచ్చని ముఖ్యంగా క్రానిక్ అబ్ స్ట్రాక్టివ్ పల్మనరీ డిసీజ్ తో బాధపడే వారిలో ఈ సమస్య ఎదురుకావచ్చని ఈ సర్వేలో వెళ్లడి అయింది…