బ్రేకింగ్ – ఏటీఎం కార్డుల్లా ఆధార్ కొత్త కార్డులు ఇలా అప్లై చేసుకోండి

బ్రేకింగ్ - ఏటీఎం కార్డుల్లా ఆధార్ కొత్త కార్డులు ఇలా అప్లై చేసుకోండి

0
123

దేశంలో ప్రతీ ఒక్కరికి ఆధార్ కార్డ్ ఉండాల్సిందే, పిల్లలకు కూడా ఇప్పుడు ఆధార్ ఉండాల్సిందే అని కేంద్రం కూడా తెలిపింది, దీంతో వేలిముద్రలు కూడా ఇప్పుడు ఇచ్చి ఆధార్ నమోదు చేస్తున్నారు, అయితే ఆధార్ కార్డ్ ఇప్పుడు ఉన్న లుక్ కి కాస్త డిఫరెంట్ గా రానుంది అని తెలుస్తోంది.

అవును మరింత లుక్ మారనుంది…డెబిట్- క్రెడిట్ కార్డు పరిమాణంలోకి రానుంది.. కొత్త ఆధార్ కార్డ్ . ఇక నుంచి ఇది పరసులో ఇమిడిపోయేంత చిన్నగా ఉండనుంది.పాలి వినైల్ క్లోరైడ్(పీవీసీ)తో రూపొందే ఈ కార్డు ధరను రూ. 50గా నిర్ణయించారు. అయితే ఈ ఆధార్ కార్డ్ కావాలి అంటే మీరు ఏం చేయాలి అంటే.

https://uidai.gov.in/ ఈ వెబ్సైట్లోకి వెళ్లి తమ ఆధార్కార్డు వివరాలను నమోదు చేసి మీ మొబైల్ ఫోన్ కు వచ్చే ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి, ఇలా చేస్తే మొత్తం అక్కడ డిస్ ప్లే అయిన వివరాలు చూసుకుని మీరు నగదు ఆన్ లైన్ లో చెల్లించవచ్చు, ఇక వెంటనే మీకు కొత్త ఆధార్ కార్డ్ 10 రోజుల్లోపు ఇంటికి వస్తుంది స్పీడ్ పోస్ట్ ద్వారా.