ఆవేదనతో నిర్భయ తల్లి కోర్టులో చేసిన పనికి షాకైన జడ్జి లాయర్లు

ఆవేదనతో నిర్భయ తల్లి కోర్టులో చేసిన పనికి షాకైన జడ్జి లాయర్లు

0
80

కోర్టులని లా లోని లొసులుగని ఉపయోగించుకుని శిక్షల నుంచి తప్పించుకుంటున్నారు కొందరు.. అయితే అమ్మాయి జీవితం నాశనం చేసి ఆమె చనిపోవడానికి కారణం అయిన నిర్భయ కేసులో నలుగురు దోషులు కూడా ఇదే ఆలోచన చేస్తున్నారు.. అలాంటి దుర్మార్గులకి కొందరు లాయర్లు కూడా సహకరిస్తున్నారు అనే విమర్శలు సమాజం నుంచి వస్తున్నాయి.. అంత దారుణంగా ఆమెని చంపేసి ఏడేళ్లుగా జైలులో మగ్గుతున్నారు.

అయితే వారికి ఉరిశిక్ష పడుతున్నా ఎప్పటి కప్పుడు వాయిదాలు పడుతూ వస్తోంది…నిర్భయ హంతకుల ఉరితీత విషయంలో జరుగుతున్న జాప్యంపై ఆమె తల్లి ఆశాదేవి బుధవారంనాడు పాటియాలా హౌస్ కోర్టు హాలులో భావోద్వేగానికి గురయ్యారు. ఆమె ఏడు సంవత్సరాలుగా వారికి ఉరి అమలు చేయాలి అని పోరాటం చేస్తున్నారు.

తాజాగా ఈ కేసులో మా హక్కుల సంగతేంటి అని ప్రశ్నిస్తూ భోరుమని ఏడ్చేశారు. నిర్భయ కేసులో దోషులైన ముఖేష్, పవన్, అక్షయ్, వినయ్ల ఉరితీతకు కొత్త తేదీ ఇవ్వాలని కోరుతూ నిర్భయ తల్లిదండ్రులు పిటిషన్ వేశారు …ఈ సమయంలో ఆమె కన్నీరు పెట్టుకున్నారు, తన కుమార్తెకి ఇంక ఎప్పుడు న్యాయం జరుగుతుంది అని బాధపడ్డారు, మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నా వీరికి డెత్ వారెంట్లు జారీ చేయాలి అని ఆమె కోరారు, ఇంకా తీర్పు రావాల్సి ఉంది.