బాలికపై గ్యాంగ్‌ రేప్. అత్యంత దారుణం

బాలికపై గ్యాంగ్‌ రేప్. అత్యంత దారుణం

0
94

ఈ స‌మాజంలో కొంద‌రు దుర్మార్గులు, నీచులు, అమ్మాయిల‌ని సులువుగా మోసం చేస్తున్నారు, న‌ల్గొండ‌లో ఓ గ్రామంలో దారుణం జ‌రిగింది.. ఓ మైన‌ర్ బాలిక‌ని దారుణంగా మోసం చేశారు కొంద‌రు యువ‌కులు, అంతేకాదు ఆమెని గ‌ర్భ‌వ‌తిని కూడా చేశారు కొంద‌రు నీచులు.

ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను కొందరు యువకులు లొంగదీసుకొని కొద్ది రోజులుగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు, ఈ విష‌యం ఎవ‌రికి చెప్ప‌వ‌ద్దు అని బెదిరించారు, ఆమెని అత్యంత దారుణంగా అత్యాచారం చేస్తున్నారు, ఆమె కూడా భ‌య‌ప‌డి ఈ విష‌యం ఎవ‌రికి చెప్ప‌లేదు.

కాని కూతురు ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు వ‌చ్చి త‌ల్లి ఆమెని ప్ర‌శ్నించింది, దీంతో అన్ని విష‌యాలు చెప్పింది, వెంట‌నే ఆస్ప‌త్రికి తీసుకువెళితే ఆమెకి క‌డుపు అని తేలింది,దీంతో వెంట‌నే పోలీసుల‌కి కంప్లైంట్ ఇచ్చారు, వారిపై కేసు న‌మోదు చేశారు పోలీసులు.. ఈ గ్యాంగ్ లో న‌లుగురు ఉన్న‌ట్లు తెలుస్తోంది, వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోనున్నారు.