బాలికపై 70ఏళ్ల వృద్దుడు అత్యాచారయత్నం…

బాలికపై 70ఏళ్ల వృద్దుడు అత్యాచారయత్నం...

0
126

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది… ఒక వృద్దుడు కామంతో రెచ్చిపోయాడు… 70 ఏళ్ల వయసున్న వృద్దుడు మనవరాలి వయసున్న బిలికపై అత్యాచారయత్నం చేయబోయాడు… తెనాలి ప్రాంతానికి చెందిన ఓ గ్రామంలో బంగారయ్య అనే వృద్దుడు జీవిస్తున్నాడు… తెలంగాణ భద్రాద్రి ప్రాంతానికి చెందిన ఒక బాలిక లాక్ డౌన్ కు ముందు తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది…

స్థానికంగా ఉన్న పిల్లలతో ఆ బాలిక బంగారయ్య ఇంటి ముందు ఆడుకుంటుంది… ఈ క్రమంలో బంగారయ్య బాలికపై కన్నేశాడు… చాక్లెట్ ఇస్తానని ఇంట్లోకి పిలిపించుకున్నాడు… ఆ తర్వాత తలుపులు మూసి బాలికపై అత్యాచారయత్నం చేయబోయాడు…. దీంతో ఆ బాలిక భయపడిపోయి గట్టిగా కేకలు వేసింది…

ఇక తనతో పాటు ఆడుకునే పిల్లలు కిటికీలోనుంచి చూసి షాకయ్యారు… వారు కూడా గట్టిగా కేకలు వేశారు… దీంతో భయపడిపోయిన బంగారయ్య బాలికను వదిలిపెట్టాడు… ఎడ్చుకుంటూ ఆ బాలిక తన అమ్మమ్మకు ఈ విషయం చెప్పింది… దీంతో ఆమె పోలీసుకు ఫిర్యాదు చేసింది.. వారి ఫిర్యాదు మేరకు బంగారయ్యపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు…