బాలికకు ముద్దు పెట్టినందుకు ఐదేళ్లు జైలు శిక్ష

బాలికకు ముద్దు పెట్టినందుకు ఐదేళ్లు జైలు శిక్ష

0
111

బాలికపై అసభ్యంగా ప్రవర్తించి ముద్దు పెట్టినందును నిందితుడికి ఐదేళ్లు జైలుశిక్షతో పాటు ఐదు వేలు ఫైన్ కూడా విధించింది న్యాయస్థానం… ముంబైలోని యాంటాప్ హిల్ ప్రాంతంలోని మురికివాడకు చెందిన బాలిక తన అక్కతో కలిసి బాత్రూమ్ కు వెళ్లింది… మురికి వాడలో అందరూ కామన్ బాత్రూమ్ కి వెళ్లాల్సిందే… వరుసగా పది బాత్ రూమ్స్ ఉంటాయి.. అక్కడ చీకటిగా ఉంటుంది…

సెల్ ఫోన్ తీసుకురమ్మని అక్క తన చెల్లిని ఇంటికి పంపించింది… దీంతో ఇంటికి వెళ్లిన చెల్లెలు సెల్ ఫోన్ తీసుకుని తిరిగి వస్తుండగా స్థానికంగా ఉన్న వ్యక్తి అబ్దుల్ రెహమాన్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు… బాలికను బలవంతంగా లాక్కుని పెదాలపై ముద్దుపెట్టాడు… దీంతో ఆబాలిక ఎడ్చుకుంటూ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది… దీంతో తండ్రి అతన్ని నిలదీసేందుకు ఇంటివెళ్లాడు…

అప్పుడు అతను ఇంటి దగ్గరలేదు… దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు… అతని ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు… ప్రస్తుతం ఆర్థర్ జైల్లో ఉన్న నిందితుడితో వీడియో కాన్ఫు రెన్స్ ద్వారా విచారించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చింది… అతనికి ఐదేళ్లు జైలు శిక్షతోపాటు ఐదువేలు జరిమానా విధించింది…