మన దేశంలో రోజు రోజుకి బ్యాంక్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త టెక్నిక్‌లతో ఖాతాదారుల డబ్బును లూటీ చేస్తూనే ఉన్నారు. మీరు కనుక అలర్ట్ గా ఉండకపోతే మనం కూడా ఏదో రోజు ఇందులో చిక్కుకుంటాం, అయితే ముందు ఇలాంటి వాటి నుంచి మనం దూరంగా ఉండాలి.. వారి వలలో చిక్కకూడదు అంటే ఏం చేయాలో చూద్దాం.
1..అనుమానాస్పద మెయిల్స్ వస్తే ఆ లింకులు ఓపెన్ చేయవచ్చు.
2.. మీకు వచ్చిన మెయిల్ కు మీరు ఎలాంటి డీటెయిల్స్ రాసి, అటాచ్ ఫైల్స్ పెట్టి సెండ్ చేయద్దు
3. మీ మెయిల్ ఐడీ ఎక్కడా బయట డేటా వారికి ఇవ్వద్దు
4. సోషల్ సైట్లకి ఇచ్చే మెయిల్ ఐడీ బ్యాంకులకి ఇచ్చే మెయిల్ ఐడీ వేరుగా ఉండేలా చూసుకోండి.
5.. ఈ-మెయిల్స్‌ను సోషల్ మీడియాలో బహిర్గతం చేయద్దు
6.. వివిధ వెబ్ బ్రౌజర్లలో ఉన్న AUTO FILL ఆప్షన్‌ను వాడద్దు
7..సివివి, ఎక్స్‌పైరీ డేట్, కార్డ్ నంబర్ ఎవరికి ఇవ్వద్దు
8. ఏటీ ఎం విత్ డ్రా చేసిన తర్వాత వచ్చేస్లిప్స్ అక్కడ పాడేయద్దు
ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ఫేస్ బుక్ వాట్సాప్ లో మీకు వచ్చే లింకులు అస్సలు ఓపెన్ చేయవద్దు అని చెబుతున్నారు పోలీసులు.