బాసర ట్రిపుల్‌ ఐటీ నోటిఫికేషన్‌ విడుదల..పూర్తి వివరాలివే..

0
95

బాసర ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల అయింది. 2022-23 సంవత్సరానికిగాను జూలై 1 నుంచి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ సర్టిఫికెట్‌ జిరాక్స్‌ కాపీలను జూలై 19లోగా యూనివర్సిటీకి పంపాల్సి ఉంటుంది.

టీఎస్ ఆన్‌లైన్‌, మీ సేవ కేంద్రాల admissions@rgukt.ac.in వెబ్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని డైరెక్టర్‌ సతీశ్‌కుమార్‌ తెలిపారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను జూలై 30న ప్రకటించనున్నట్లు యూనివర్సిటీ డైరెక్టర్‌ పేర్కొన్నారు.

టెన్త్‍ పాసైన విద్యార్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

ఎంపికైన విద్యార్థుల జాబితాను జూలై 30న విడుదల చేస్తామని పేర్కొన్నారు. మొత్తం సీట్లలో 85 శాతం సీట్లకే నోటిఫికేషన్‌ ఇచ్చామని, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఓపెన్‌ క్యాటగిరికి చెందిన 15 శాతం సీట్లను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. మరో 75 సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులు రూ.1.36 లక్షలు చెల్లించి దరఖాస్తు ద్వారా అడ్మిషన్‌ పొందవచ్చు. ఒకవేళ సీట్లు మిగిలితే తెలంగాణ, ఏపీ నుంచి పేమెంట్‌ సీట్లకు అవకాశం కల్పిస్తారు.