స్నానం చేస్తున్న యువ‌తి ఫోటోలు తీశారు చివ‌ర‌కు ఆమెని ఏం చేశారంటే

స్నానం చేస్తున్న యువ‌తి ఫోటోలు తీశారు చివ‌ర‌కు ఆమెని ఏం చేశారంటే

0
134

కొంద‌రు దుర్మార్గులు నీచులు చేసే ప‌నులు చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్య చేసుకునేలా ప్రేరేపిస్తాయి, వారి వేధింపులు తాళ‌లేక ఏకంగా చ‌నిపోయేంత వ‌ర‌కూ వెళుతున్నారు, త‌మిళ‌నాడు బాగాయంలో ఓ బాలిక 10 వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది ఆమె రోజూ స్నానం చేసే స‌మ‌యంలో ముగ్గురు యువ‌కులు సీక్రెట్ గా ఆమె ఫోటోలు తీశారు.

దీంతో ఆమెని త‌మ కోరిక తీర్చాలి అని వాటిని చూపించి బెదిరించారు, దీంతో ఆమె చాలా మ‌న‌స్ధాపానికి గురి అయింది..ఈ వేధింపులు త‌ట్టుకోలేక బాలిక ఈనెల 13న ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 90 శాతం గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి తీసుకువెళ్లారు.

కాని ఆమె మ‌ర‌ణించింది, అయితే ఇంత దారుణానికి కార‌ణం అయిన ముగ్గురు నీచుల‌ని పోలీసులు అరెస్ట్ చేశారు, ఆమె కుటుంబ స‌భ్యులు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు.