భావతో మరదలు చనువు… చివరకు ఎక్కడివరకు దారితీసిందో చూడండి…

భావతో మరదలు చనువు... చివరకు ఎక్కడివరకు దారితీసిందో చూడండి...

0
108

అవాంఛిత గర్భం ఆదరాబాదరాగా అబార్షన్ నొప్పుతో కూడిన చావు 17 ఏళ్ళకే అమ్మాయికి అనుభూతులివి… అక్క భర్తతో పెరిగిన చనువు ఆమెను మృత్యువు వరకు తీసుకెళ్లింది. భావ చేతిలో మోసపోయి గర్భవతిగా మారి ఆ గర్భాన్ని తొలగించుకునే క్రమలో ఓ బాలిక ఏకంగా కన్నుమూసింది… మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి…ఒక వ్యక్తి కోల్ కత్తలో పని చేస్తున్నాడు… ఈ ఏడాది జనవరి నెలలో స్వగ్రామానికి వచ్చాడు… ఆ సమయంలో తన భార్య చెల్లెలితో సన్నిహితంగా ఉండేవాడు దీన్ని గమనించిన బాలిక తల్లి ఆమెను మందలించింది…

ఆతర్వాత ఆ వ్యక్తి కోల్ కత్తకు వెళ్లిపోయాడు… ఆయన వెళ్లిపోయిన తర్వాత తల్లికి ఆ బాలిక గర్భవతి అని తెలిసింది.. అనుమానంతో తల్లి కూతురుని నిలదీయగా అసలు విషయం బయట పెట్టింది…. కోల్ కత్తలో ఉన్న అల్లుడికి ఫోన్ చేసి మందలించింది…తాను ప్రస్తుతం లాక్ డౌన్ చిక్కుల్లో ఉన్నానని ప్రస్తుతానికి అబార్షన్ చేయించాలని డబ్బులు పంపిస్తానని చెప్పాడు దీంతో చేసేదేమీలేక ఆమెకు అబార్షన్ చేయించారు…

అబార్షన్ చేసిన తర్వాత కొన్నిరోజులకు బాలికకు తీవ్ర రక్త శ్రావం అవుతుండటంతో తిరిగి ఆసుపత్రికి తీసుకువెళ్లారు… మెరుగైన వైద్యం కోసంవేరే ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లారు అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది… దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…