మంగాపురంలో సీతారామయ్య కుమార్తెకు ఈ వైరస్ లాక్ డౌన్ వేళ, వివాహం నిశ్చయించారు, అయితే ఒకే ఊరిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇళ్లు కావడంతో వారి కొబ్బరి తోటలోనే వివాహం పందిరి వేసి జరపించాలి అని ఏర్పాట్లు చేశారు.. కేవలం అటు ఇటు కలిపి 20 మంది కుటుంబ సభ్యుల్ని పిలిచారు.
ఊరు జనాలని లాక్ డౌన్ తర్వాత పిలిచి వ్రతం, రిసెప్షన్ చేసుకోవాలి అని అనుకున్నారు. అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంటికి వచ్చాడు, మరికొద్ది సేపట్లో పెళ్లి, ఈ సమయంలో సరదాగా బావగారిని ఆటపట్టించాలి అని భావించిన, పెళ్లికొడుకు బావమరిది ఉప్పు కలిపిన నీటిని డ్రింక్ అని ఇచ్చాడు,
ఇది కూల్ డ్రింక్ అని కూల్ వాటర్ లో కలిపి ఉప్పు కలిపి ఇచ్చాడు, దీంతో నోట్లో గ్లాస్ పెట్టుకుని వెంటనే ఊసేశాడు, కోపంతో పెళ్లికొడుకు నాతో వెటకారం ఆడతావా అని బావమరిదితో గొడవకు దిగాడు, అంతేకాదు రెడీ అయిన బట్టలు తీసేసి, ఈ పెళ్లి చేసుకోను అని పంతం పట్టాడు, దీంతో బావ మరిది పెళ్లి కూతురు తండ్రి బ్రతిమలాడటంతో పెళ్లికి ఒప్పుకున్నాడు , చివరకు రాత్రి పెళ్లి జరిగింది, ఇంకెప్పుడూ బావగారితో ఇలాంటి వేశాలు వేయను అని అందరితో అన్నాడట ఈ బావమరిది.