బయటపడ్డ భారీ సొరంగం.. గుర్తించిన సైన్యం ఏముందంటే ?

బయటపడ్డ భారీ సొరంగం.. గుర్తించిన సైన్యం ఏముందంటే ?

0
97

ఉగ్ర‌వాదుల పై నిఘా ఎప్పుడూ ఉంటుంది, మ‌న సైన్యం నిరంత‌రం అన్నీ అబ్జ‌ర్వ్ చేస్తూనే ఉంటుంది… మ‌న దేశంపై కుట్ర ప‌న్నుతూనే ఉంటారు ఈ ఉగ్ర‌మూక‌లు.. ఇలాంటి వారిని ఎక్క‌డిక‌క్క‌డ మ‌ట్టుబెడుతున్నారు మ‌న సైనికులు.

తాజాగాజమ్మూలో భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు కంచెకు సమీపంలో ఓ సొరంగాన్ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గుర్తించినట్టు అధికారులువెల్లడించారు..

అయితే ఇలాంటివి ఇంకా ఎక్క‌డైనా ఉన్నాయా అనే అనుమానంతో అంతా జ‌ల్లెడ ప‌డుతున్నారు, ఇలా ఇందులో నుంచి ఉగ్రవాదుల చొరబాటుకు, మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాకు ఉపయోగపడే సొరంగాల నిర్మాణాన్ని చేస్తున్న‌ట్లు తెలుస్తోంది

సొరంగం ముఖద్వారం ద‌గ్గ‌ర కప్పి ఉంచిన ఇసుక బస్తాలపై పాకిస్థాన్ గుర్తులు ఉన్నట్టు గుర్తించారని
తెలుస్తోంది, దీంతో సైన్యం అల‌ర్ట్ అయ్యారు, ప్రొక్లెయిన్ రప్పించి, తవ్వకాలు జరపడంతో నిర్మాణంలో ఉన్న సొరంగం బయటపడింది. భూమికి 25 అడుగుల లోతులో గుర్తించిన సొరంగం పొడవు 50 మీటర్లు ఉందని తెలిపాయి.పాకిస్థాన్ సరిహద్దు పోస్ట్ గుల్జార్ 700 మీటర్ల దూరంలో ఉందిఇది.దీంతో అనుమానాలు మరింత బ‌ల‌ప‌డుతున్నాయి.