శవంతో బీమా కంపెనీకి బుద్ది చెప్పిన కుటుంబం

శవంతో బీమా కంపెనీకి బుద్ది చెప్పిన కుటుంబం

0
91

ఈరోజుల్లో చాలా మందికి భీమా అనేది ఖచ్చితం అయింది, చాలా మంది భవిష్యత్తు కోసం తమ కుటుంబం కోసం బీమా చేయించుకుంటున్నారు.

గతంలో రెండు మూడు కంపెనీలు ఉండేవి కాని ఇప్పుడు వందల బీమా కంపెనీలు పుట్టుకువచ్చాయి. ముఖ్యంగా బీమా సర్వీసు ఎక్కడ

చూసినా ఒకేలా ఉంటుంది కాని, మనం చెల్లించే వాయిదా ప్రకారం ఆ పాలసీ ప్రీమియం ఆధారపడి ఉంటుంది. కొన్ని బీమా కంపెనీలు డబ్బులు ఇవ్వడానికి ముప్పు తిప్పలు పెడతాయి

తాజాగా దక్షిణాఫ్రికాలో ఓ వ్యక్తి చనిపోయాడు, ఆ తర్వాత అతనికి బీమా ఉండటంతో కుటుంబ సభ్యులు కంపెనీలో క్లెయిమ్ చేసుకోవాలని భావించారు, మూడు రోజులు అయినా కంపెనీ వారు పది సార్లు తిప్పించుకున్నారు కాని బీమా డబ్బులు చెల్లించలేదు… దీంతో కుటుంబ సభ్యులు ఏకంగా పూడ్చిపెట్టిన శవాన్ని సమాధి నుంచి బయటకు తీసి ఆ సంస్థ ఆఫీసులోకి తీసుకెళ్లారు. ఇది వినడానికి మతిపోయేలా ఉన్నా ఆ కంపెనీ చేసిన నిర్వాకానికి ఆ కుటుంబ సభ్యులు ఇలాంటి పని చేయవలసి వచ్చింది.

ఈ విషయం ఇలా మీడియాలో వైరల్ కావడంతో ఓల్డ్ మ్యూట్యువల్ సంస్థ స్పందించింది. వారికి బీమా నగదు చెల్లించామని తెలిపింది. అయితే వారు చేసిన పనికి ఏకంగా కొత్త పాలసీలు ఎవరూ తీసుకోలేదట, ఇలాగే తమ కుటుంబానికి సమస్య వస్తే మా పని కూడా అంతే కదా అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు…దీంతో ఆ కంపెనీకి మూడు రోజుల్లో కోట్ల రూపాయల నష్టం వచ్చిందట. ఈ కుటుంబం చేసిన పనితో ఆ కంపెనీ పరువు మొత్తం పోయింది అంటున్నారు నెటిజన్లు.