హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్..రాగల 24 గంటల్లో ఈ ప్రాంతాల్లో..

0
88

హైదరాబాద్ వాసులారా బిగ్ అలెర్ట్. హైదరాబాద్ లో రాగల 24 గంటల్లో 200 mm వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీనితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భాగ్యనగరంలోని హయత్ నగర్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, మలక్ పేట, చార్మినార్, గోషుమాల్, అంబర్ పేట, ఉప్పల్, ముషీరాబాద్,బేగంపేట, ఖైరతాబాద్,మల్కాజ్ గిరి, కాప్రా, కంటోన్మెంట్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే కురిసిన వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం కాగా తాజా వార్త పట్టణ వాసుల్లో వణుకు పుట్టిస్తుంది. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.