హైదరాబాదీలకు బిగ్ అలెర్ట్..రేపు ఈ మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

0
112

రేపు హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. రద్దీ లేని మార్గాల్లో వీలైనంత వరకు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ వెల్లడించింది. ఆదివారం అనగా..జూన్ 26న పలు లోకల్ ట్రైన్స్ ను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు వివరాలివే..

లింగంపల్లి నుంచి హైదరాబాద్ కు నడిచే ఎంఎంటీఎస్ సర్వీసుల్లో 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140 నంబర్ గల సర్వీసులు రద్దు అయ్యాయి.

హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120 నంబర్ గల సర్వీసులను అధికారులు రద్దు చేశారు.

ఫలక్ నూమా-లింగంపల్లి మార్గంలో 47153, 47164, 47165, 47116, 47166, 47220, 47170 నంబర్ గల సర్వీసులను అధికారులు రద్దు చేశారు.

లింగంపల్లి-ఫలక్ నూమా మార్గంలో 47176, 47189, 47186, 47210, 47187, 47191, 47192 నంబర్ గల సర్వీసులను అధికారులు రద్దు చేశారు.

సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు నడిచే 47150 నంబర్ గల సర్వీసును, లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ వరకు నడిచే 47195 నంబర్ గల సర్వీసును రద్దు చేస్తునట్టు అధికారులు స్పష్టం చేసారు.