తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలెర్ట్..రేపే ఫలితాలు రిలీజ్

0
93

ఇటీవలే ఇంటర్‌ పరీక్షలు ముగియగా ఫలితాల కోసం తల్లిదండ్రులు, విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అలాంటివారికి తెలంగాణ ఇంటర్‌ బోర్డ్‌ ఫలితాలపై కీలక ప్రకటన చేసి శుభవార్త చెప్పింది. ఇంటర్ పరీక్షా ఫలితాలు బుధవారం అంటే రేపు విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది దాదాపు 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలను రాయగా..సమాధాన పత్రాల మూల్యాంకనం 14 కేంద్రాల్లో కొనసాగినట్టు అధికారులు తెలిపారు.

ఇక పదవతరగతి ఫలితాల విషయానికొస్తే జూన్ 25న లేదా 26న ప్రకటించే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ లేదని అధికారులు తెలిపారు. ఇంటర్ సెకండియర్ క్లాసులు ఈ నెలలోనే ప్రారంభం కాగా..పదో తరగతి పరీక్షా ఫలితాలు వెలువడిన తర్వాత ఇంటర్ ఫస్టియర్ క్లాసులు జులై 1 నుంచి ప్రారంభంకానున్నాయి.