వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయంలో భారీ చోరీ

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయంలో భారీ చోరీ

0
118

దేశ వ్యాప్తంగా దొంగలు విచ్చల విడిగా రెచ్చిపోతున్నారు… సాధారణ ప్రజల ఇల్లల్లోనే కాదు ప్రజా ప్రతినిధుల కార్యాలయాల్లో కూడా చోరీకి పాల్పడుతున్నారు… తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కార్యాలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు…

సుమారు 10 లక్షలకు పైగా విలువ చేసే సొత్తును దుండగులు చోరీ చేశారు… ఈ చోరీ అర్థరాత్రి సమయంలో జరిగింది… విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి తన కార్యాలయానికి చేరుకున్నారు…

ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు… దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు… అనుమానితుడిగా ఉన్న ఓ వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు… అతని నుంచి పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు…