దసరా, దీపావళి ఫెస్ట్ వల్స్ కు చాలామంది మొబైల్ ప్రియులు మొబైల్స్ ను కొనుక్కుంటారు… సాధారణ రోజుల్లో కాకుండ ఈ రెండు ఫెస్ట్ వల్స్ కు మొబైల్స్ పై ఆఫర్స్ ప్రకటిస్తారు అందుకే చాలామంది దసరా దీపావళి పండుగల సమయంలో ఫోన్స్ తీసుకుంటారు…
అయితే తాజాగా వారందరికీ బిగ్ షాక్ తగిలింది… మొబైల్స్ ధరను 3 శాతం వరకు పెంచుతున్నట్లు సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ తెలిపింది… 2020 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సుంకం కారణంగా మొబైల్ ఫోన్లధరలు 1.5శాతం నుంచి 3 శాతం వరకు పెరగవచ్చని చెప్పింది…
దేశీయంగా ఎలక్ట్రానిక్ విడిభాగాలు ఉత్పత్తిని పెంచడంతో పాటు దిగుమతులను క్రమక్రమంగా తగ్గించుకోవడమే పీఎంపీ ప్రధాన కారణం కరోనా సంక్షోభం జాతీయన పర్యావరణ ట్రిబ్యునల్ గతంలో విధించిన నిషేధం కారణంగా ఫోన్ల డిస్ ప్లే అసెంబ్లీ ఉత్పత్తి లక్ష్యం మేరకు పెంచలేకపోయారు…