కేంద్రం తీసుకువచ్చిన కొత్త రూల్స్ వాహనదారులకి చాలా ఉపయోగపడనున్నాయి.అక్టోబర్ 1 నుంచి రవాణాశాఖ కొత్త రూల్స్ తీసుకువచ్చింది…కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త రూల్స్ను నోటిఫై చేసింది.
ఇకపై వాహనదారులు వెహికల్ డాక్యుమెంట్లను కలిగి ఉండాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ రూపంలో చూపించొచ్చు. అంటే మీరు కాగితాల రూపంలో డాక్యుమెంట్లు చూపించక్కర్లేదు, ఆన్ లైన్ ఎలక్ట్రానిక్ రూపంలో మీ డాక్యుమెంట్లు చూపించవచ్చు.
వెహికల్ రిజిస్ట్రేషన్ (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డిజిలాకర్ DigiLocker వంటి సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్లో స్టోర్ చేసుకోవచ్చు. దీనిలో మీ బైక్ కారు డాక్యుమెంట్లు సేవ్ చేసుకుని వాటిని చూపిస్తే సరిపోతుంది, ఇక మీరు నేరుగా వెహికల్ పేపర్లు చూపించక్కర్లేదు.
ఇక మీకు వచ్చిన ఫైన్లు మీరు చేసిన తప్పులు అన్నీ ఎలక్ట్రానిక్ రూపంలో డేటాలో సేవ్ చేసి ఉంచుతారు, రూల్స్ బ్రేక్ చేస్తే కేసులు నమోదు చేస్తారు, ఇక మీరు బైక్ నడిపే సమయంలో ఫోన్ మాట్లాడకూడదు, కేవలం రూట్ నావిగేషన్కు ఫోన్ ఉపయోగించొచ్చు ఇది మర్చిపోకండి.