అందంగా లేనందుకు ఒక యువకుడు ఎంత దారుణానికి పాల్పడ్డాడో చూడండి….

అందంగా లేనందుకు ఒక యువకుడు ఎంత దారుణానికి పాల్పడ్డాడో చూడండి....

0
92

ఒక యువకుడు అందంగా లేనందుకు దారుణానికి పాల్పడ్డాడు… ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…. శ్రీకాకుళం జిల్లా మాణిక్యపురంకు చెందిన సునీల్ నాయక్ అనే యువకుడు అందంగా లేనని మనస్థాపంతో ఇంట్లో ఎవ్వరులేని సమయంలో ఫ్యాక్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు…

మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సునీల్ కు చిన్న తనం నుంచి ముఖంపై మచ్చలు ఉండేవి అయితే కాలేజీకి వెళ్లడం ప్రారంభించాక ముఖంపై మచ్చలు ఉండటాన్ని సునీల్ నాయక్ చిన్నతనంగా భావించాడు… దీంతో కాలేజీకి వెళ్లిన ప్రతీ సారి ముఖానికి కర్చీఫ్ పెట్టుకుని వెళ్లేవాడు… ఈ క్రమంలో సునీల్ ముఖంపై మచ్చలు పోగొట్టుకునేందుకు ఎంతో మంది వైద్యులను కలిశాడు…

ఎన్నో మందులను వాడాడు కానీ ఫలితం దక్కలేదు… దీంతో తననందరూ చులకనగా చూస్తారని తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురయ్యేవాడు… ఈ తరుణంలో ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు… ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…