సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తుంటారు అయినా కూడా మోసపోతుంటారు.. తాజాగా ఓ యువకుడు సోషల్ మీడియా ఫేస్ బుక్ ద్వారా ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా 100 మంది అమ్మాయిలను ట్రాప్ చేశాడు… ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది…
ఇటీవలే ఒక అమ్మాయి ఫిర్యాదు తో అసలు విషయం బయటపడింది.. ప్రకాశం జిల్ల వలేటివారిపాలెం మండలం కలళ్లకు చెందిన ఒక యువకుడు హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు… ఫేస్ బుక్ లో అపరిచిత వ్యక్తులకు ఫ్రెండ్ రిక్వస్ట్ పెట్టి వారి నంబర్లను తీసుకుని వాట్సప్ లో చాట్ చేస్తూ పరిచయం పెంచుకునేవాడు…
అంతేకాదు తనకు బంగారం షాపు ఉందని చెప్పి అమ్మాయిలను ట్రాప్ లో వేసుకునేవాడు తనకు న్యూడ్ ఫోటోలను పంపితే బంగారం ఇస్తానని చెప్పేవాడు ఆ తర్వాత లైంగికంగా వేధించేవాడు.. తాను చెప్పింది చేయకుంటే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించేవాడు తాజాగా అదే జిల్లాకు చెందిన అమ్మాయి పరిచయం చేసుకుని బ్లాక్ మేయిల్ చేశాడు… అయితే ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి మొబైల నంబర్ ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు పోలీసులు…