బాయ్స్ లాకర్ రూం ఇందులో వీరు చేసే చెండాల‌మైన ప‌ని ఇదేన‌ట‌

బాయ్స్ లాకర్ రూం ఇందులో వీరు చేసే చెండాల‌మైన ప‌ని ఇదేన‌ట‌

0
98

కొంద‌రు చ‌దువుకుంటారు కాని సంస్కారం ఉండ‌దు, వారి వ‌య‌సుకు వారు చేసే ప‌నుల‌కి అస్స‌లు పొంత‌న ఉండ‌దు, దేశ రాజధానిలో సంచలనం సృష్టించింది బాయ్స్ లాకర్ రూం గ్రూప్ .. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్ అడ్మిన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు గ్రూప్‌ను డీయాక్టివేట్ చేశారు.

వీరు చేసే ప‌ని తెలిస్తే ఛీ ఛీ అనాల్సిందే. దక్షిణ ఢిల్లీలోని 11, 12వ తరగతులకు చెందిన వీరంతా
ఈ బాయ్స్ లాక‌ర్ రూమ్ అనే పేరుతో ఓ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు, ఇందులో అమ్మాయిల ఫోటోలు పెట్టి వాటిని మార్ఫింగ్ చేసి వాటి గురించి అశ్లీలంగా మాట్లాడ‌టం గ్రూప్ ఛాట్ చేసుకునేవారు, మొత్తానికి ఈ ఛాటింగ్ ఓ యువ‌తికి చేరింది.

ఆమె కంప్లైంట్ ఇవ్వ‌డంతో వీరి చెత్త ఛాటింగ్ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చింది..ఆ యువతి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం అంద‌రిని అదుపులోకి తీసుకుని వారి సెల్ ఫోన్లు కూడా తీసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు, ఇంకా ఇలాంటి గ్రూపులు ఉన్నాయా అని పూర్తిగా విచార‌ణ చేస్తున్నారు.