బ్రేక్ ఫాస్ట్ – లంచ్ – డిన్నర్ ఏ సమయంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

బ్రేక్ ఫాస్ట్ - లంచ్ - డిన్నర్ ఏ సమయంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

0
121

ఈ ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కో విధమైన రంగంలో ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ ఉంటారు, ఎవరి బిజీ లైఫ్ వారిది..ఇలాంటి సమయంలో సమయానికి సరైన తిండి తినకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మరి ఏ సమయంలో బ్రేక్ ఫాస్ట్ తినాలి ఎప్పుడు లంచ్ చేయాలి ఎప్పుడు నైట్ డిన్నర్ చేయాలి అంటే మనకు ఓ సరైన ప్రణాళిక ఉండాలి అంటున్నారు వైద్యులు.

ప్రతి రోజు నిర్ణీత సమయానికి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసేలా చూసుకోవాలి. ఈ మూడింటిని ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటే.. జీవక్రియ సక్రమంగా సాగడమేకాకుండా, బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది

అయితే మీ ఉదయం సమయం 5 లేదా ఆరు గంటలకు లేచి ప్రారంభం అయితే కచ్చితంగా మీరు 8 గంటల లోపు బ్రేక్ ఫాస్ట్ ముగించాలి.

లంచ్..
మధ్యాహ్నం తీసుకునే భోజనం చాలా ప్రధానమైనది మధ్యాహ్నం 1 నుంచి 2 రెండు గంటల మధ్య భోజనం తీసుకోవడం ఉత్తమం. ఇలా తీసుకుంటే మంచిగా ఫుడ్ జీర్ణం అవుతుంది.

డిన్నర్..
రాత్రి పూట భోజనం ఎంత తొందరగా వీలైతే.. అంత త్వరగా పూర్తి చేయాలి, అలాగే మితంగా తీసుకోవాలి,
రాత్రి 8 గంటల సమయంలో డిన్నర్ చేయడం ద్వారా కాలరీలు తగ్గుతాయి అంటే మీరు 10 గంటలకు నిద్రకు ఉపక్రమించాలి.