బ్రేకింగ్ — ఈ సమస్య ఉందా ఇది కూడా కరోనా లక్షణమే

బ్రేకింగ్ --- ఈ సమస్య ఉందా ఇది కూడా కరోనా లక్షణమే

0
91

ఇప్పుడు జలుబు దగ్గు వస్తే కరోనా వచ్చింది ఏమో అని చాలా మంది భయపడుతున్నారు, అన్నీ జ్వరాలు అన్నీ దగ్గులు జలుబులు తుమ్మలు కరోనాకి సంకేతం కాదు.. ఆందోళనతో మరింత వ్యాధి పెరుగుతోంది, అయితే సీజనల్ వ్యాధులు ఉంటాయి, మేజర్ గా అన్నీ సింప్టమ్స్ కనిపిస్తే కరోనా అని అనుమానించాలి అని చెబుతున్నారు వైద్యులు.

ఇక ఈ కేసులు పెరిగే కొద్ది అనేక లక్షణాలు కొత్తవి గుర్తిస్తున్నారు వైద్యులు, ఇప్పటి వరకూ జ్వరం, తలనొప్పి దగ్గు, ఆయాసం, కండరాల నొప్పి, రుచి గ్రహించకపోవడం ,వాసన కోల్పోవడం వింటూ ఉన్నాం, తాజాగా మరో లక్షణం కూడా వచ్చింది.

తాజాగా కరోనా వైరస్ తో జుట్టు కూడా ఊడిపోతోందని తేల్చారు. అయితే అందరు పేషెంట్లలో ఈ సమస్య ఉండటం లేదని.. కొందరిలోనే కనిపిస్తోందని చెప్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న రెండు నెలల తర్వాత కూడా జుట్టు రాలిపోతున్నట్టుగా గుర్తించారు. కొందరిని స్కిన్ ఇన్ ఫెక్షన్లు కూడా వస్తున్నాయి అని అంటున్నారు. ఇలా జుట్టు అందరికి కాదని కొందరికి ఊడిందని వారికి టెస్ట్ చేస్తే కరోనా పాజిటీవ్ తేలింది అంటున్నారు వైద్యులు.