బ్రేకింగ్… కరోనా ఆయుర్వేదిక్ చికెన్ ధమ్ బిర్యాని…

బ్రేకింగ్... కరోనా ఆయుర్వేదిక్ చికెన్ ధమ్ బిర్యాని...

0
102

ప్రస్తుతం కరోనా దెబ్బకు హోటల్స్ అన్ని బంద్ అయిన సంగతి తెలిసిందే… అక్కడక్కడా ఓపెన్ చేసినా కూడా కరోనా భయంలో ఎవ్వరు అడుగు ముందుకు వెయకున్నారు… దీంతో వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతున్నారు… కొంతమంది వ్యాపారస్తులు కస్టమర్లను ఆకర్షించేందుకు వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు…

ఇటీవలే కూరగాయలు అమ్ముకునే వ్యక్తి కరోనా టెస్ట్ చేయించుకు ఆ రిపోర్ట్ ను లైసెన్స్ తరహాలో బోర్డు పెట్టుకుని కూరగాయలు అమ్ముతున్నారు… ఇక మరికొందరు కరోనా టీతో వ్యాపారం చేస్తున్నారు… అయితే ఇదే క్రమంలో ఆయుర్వేదిక్ చికెన్ ధమ్ బిర్యాని మార్కెట్ లోకి వచ్చింది… ఈ ఆయుర్వేదిక్ చికెన్ ధమ్ బిర్యానిలో రోగనిరోదక శర్తి ఉంటుందని వ్యాపారస్తులు చెబుతున్నారు…

దీంతో ప్రజలు ఆయుర్వేద చికెన్ ధమ్ బిర్యానిని కొనుక్కునేందుకు ఎగబడుతున్నారు… అంతేకాదండోయ్ ధర కూడా తక్కువే కేవలం 140 మాత్రమే… ఈ హోటల్ కామారెడ్డి జిల్లా బాన్స్ వాడలో ఉంది…. ఈ బిర్యానిలో దాల్చిన చెక్కా సొంఠి మిరియాలు లవంగాలు ఉసిని తులసి పౌడర్ తో పాటు వివిధ రకాల మూలికలతో తయారు చేస్తున్నారు…