ప్రపంచంలో ఇటీవల విమాన ప్రమాదాలు అందరిని కలవరానికి గురిచేస్తున్నాయి…..పెద్ద పెద్ద విమానాలు సముద్రాలలో కూలిపోవడం లేదా కొండలను ఢీకొట్టడం లాంటివి జరుగుతున్నాయి.. దీని వల్ల అపార ప్రాణ నష్టం కూడా జరుగుతోంది. తాజాగా మరో ప్రమాదం అందరిని కలిచివేసింది… 100 మందితో ప్రయాణిస్తున్న ఓ విమానం కజకిస్తాన్లో కూలిపోయిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు…అల్మాటీ ఎయిర్పోర్ట్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం టేక్ ఆఫ్ అయిన బెక్ ఎయిర్ క్రాఫ్ట్ కాసేపటికే కూలిపోయింది.
వెంటనే సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రులని ఆస్పత్రికి తరలించారు.. సుమారు 95 మంది ప్రయాణికులు 5 గురు ఉద్యోగులు అందులో ఉన్నారు అని చెబుతున్నారు.. అల్మాటీ ఎయిర్ పోర్ట్ అధికారులు అక్కడకు వెళ్లారు.. విమానం ప్రయాణం చేస్తూ కిందికి దిగిపోయింది..ఓ కాంక్రీట్ గోడను గుద్దుకుని, ఓ రెండస్థుల భవనాన్ని ఓ వైపు ఢీకొట్టింది.
గతంలో ఇలాగే రెండు ప్రమాదాలు జరిగాయి.. దీనిపై ఆ దేశ అధ్యక్షుడు ఖాసిమ్-జొమార్ట్ తొకయేవ్ విచారం వ్యక్తం చేశారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ వారికి చికిత్స అందించాలి అని అధికారులకు తెలియచేశారు.