బ్రేకింగ్ నిర్భయ దోషులు నలుగురి చివరి కోరిక ఇదేనట

బ్రేకింగ్ నిర్భయ దోషులు నలుగురి చివరి కోరిక ఇదేనట

0
137

అమ్మాయిలపై అమానుషాలు ఎక్కడా ఆగడం లేదు, ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా మార్పు రావడం లేదు..దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకూ ఉరిశిక్ష తేదీ ఖరారైంది. జనవరి 22వ తేదీ ఉదయం 7 గంటలకు తిహార్ జైలులో చనిపోయే వరకూ వారిని ఉరి తీయాలని పటియాలా హౌస్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిర్భయ కేసులో ఆమెకు న్యాయం జరిగింది అని అందరూ అంటున్నారు.

ఆమె కుటుంబం ఏడు సంవత్సరాలుగా కన్నీరు మున్నీరు అవుతోంది. తన బిడ్డని చంపిన వారిని మేపుతున్నారని ఆమె కోర్టులో కేసు వేశారు, అయితే ఇద్దరిలో ఒకరు ఆత్మహత్య చేసుకోగా ఒకరు మైనర్ కావడంతో శిక్ష తర్వాత జీవనం సాగిస్తున్నాడు, ఇక మరో నలుగురికి ఉరిశిక్ష అని కోర్టు తీర్పు ఇచ్చింది.

దోషులు ముఖేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ లకు డెత్ వారెంట్లు జారీ చేశారు. తమను ఉరి తీసే తేదీని ప్రకటించిన వెంటనే దోషులు నలుగురూ వెక్కి వెక్కి ఏడ్చారని అధికారులు చెబుతున్నారు.. ఇక వారి నలుగురి చివరి కోరిక తీర్చనున్నారు జైలు అధికారులు, అయితే వారికి చివరి కోరిక కేవలం వారి కుటుంబంతో ఓ రెండు గంటలు మాట్లాడే అవకాశం కల్పించాలి అని కోరారట, దీనికి పోలీసులు జైలు అధికారులు కూడా ఒకే చెప్పారు అని తెలుస్తోంది …21 వ తేదిన ఉదయం వారి కుటుంబాలు జైలులో ప్రత్యేక భద్రత నడుమ చివరిచూపు చూడనున్నారట.