బ్రేకింగ్ — మ‌రో మారుతిరావు – హైద‌రాబాద్ లో పరువు హత్య

బ్రేకింగ్ -- మ‌రో మారుతిరావు - హైద‌రాబాద్ లో పరువు హత్య

0
161
Russian death in Odisha

ప్రేమ పెళ్లి చేసుకున్న జంట‌ల‌పై ఆ కుటుంబ స‌భ్యులు దాడులు చేస్తున్న ఘ‌ట‌న‌లు కేసులు అనేకం వింటున్నాం, ఇక మిర్యాల‌గూడ‌లో అమృత ప్ర‌ణ‌య్ కేసు దేశంలోనే సంచ‌ల‌నం అయింది, అయితే ఇప్పుడు ఇలాంటి మ‌రో ఘ‌ట‌న హైద‌రాబాద్ లో జ‌రిగింది.

హైదరాబాద్ నగరంలో పరువు హత్య కలకలం రేపుతోంది. కూతురుని ప్రేమ పెళ్లి చేసుకున్న వ్యక్తిని.. తండ్రి కిరాతకంగా హత్య చేయించాడు.చందానగర్‌కు చెందిన హేమంత్ అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇక ఇద్ద‌రు క‌లిసి వివాహం అయ్యాక ఓ ఫ్లాట్ లో ఉంటున్నారు.

ఇక కూతురు ఇలా వేరే కులం వ్య‌క్తిని పెళ్లి చేసుకోవ‌డం ఆ తండ్రికి న‌చ్చ‌లేదు..హేమంత్‌ను ఎలాగైనా అంతమొందించాలని అనుకున్నాడు. ఈ క్రమంలో కిరాయి గుండాలతో అతన్ని హత్య చేయించాలని అనుకున్నాడు.గురువారం హేమంత్‌ను కొందరు వ్యక్తులతో కిడ్నాప్ చేయించాడు. చివ‌ర‌కు అత‌నిని చంపేశారు, అయితే అత‌నిని కిడ్నాప్ చేసిన స‌మ‌యంలో ఆమె కూడా ప‌క్క‌న ఉంది, కాని వారి నుంచి ఆమె త‌ప్పించుకుంది.

వెంట‌నే యువతి పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంట‌నే సంగారెడ్డి జిల్లా కిష్టాయిగూడెంలో సమీపంలోని చెట్లలో హేమంత్ మృతదేహాన్ని కనుగొన్నారు. అయితే దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీ‌సులు. ఆ యువ‌తి కుటుంబ స‌భ్యులు కొంత‌మందిని అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.