ఏటీఎంలో నగదు వస్తుంది అనేది తెలుసు.. మరి రైస్ ఏటీఎం ఏమిటి అని ఆలోచన వస్తోందా, ఎస్ దీనికి ఓ స్టోరీ ఉంది, కర్ణాటకలో సరికొత్తగా రైస్ ఏటీఎంలు రానున్నాయి. రేషన్ కార్డు వినియోగదారుల ఇబ్బందులు తీర్చేందుకు కర్ణాటక సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
త్వరలో బియ్యం సరఫరా యంత్రాలను రైస్ ఏటీఎం రాష్ట్రంలో ప్రవేశపెట్టేందుకు ఆలోచన చేస్తోంది. ఈ వ్యవస్థ ద్వారా చౌకధర దుకాణాల ముందు ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితిని నివారించవచ్చని భావించి ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక ఇవి రెండు మెషిన్ల ముందు తీసుకువస్తారు, దీని ద్వారా మీకు స్మార్ట్ కార్డ్ ఇస్తారు, మీరు ఈ యంత్రంలో ఆ స్మార్ట్ కార్డ్ పెడితే మీకు బియ్యం వస్తాయి, వియత్నాం, ఇండోనేషియాలో ఉపయోగించారు. ఇలా ఇప్పుడు కర్ణాటక సర్కారు ఆలోచన చేస్తోంది, సక్సెస్ అయితే త్వరలో దీనిని అన్నీ ప్రాంతాల్లో అమలు చేయాలి అని చూస్తున్నారట.