తమ్ముడి భార్యను అతి కిరాతకంగా నరికి చంపిన అన్న…

తమ్ముడి భార్యను అతి కిరాతకంగా నరికి చంపిన అన్న...

0
89

తమ్ముడి భార్యను అన్న అతి కిరాతకంగా నరికి చంపాడు అన్న… ఈ సంఘటన కర్నూల్ జిల్లా నందికొట్కూరు పరిధిలోని దామగట్ల గ్రామంలో జరిగింది… ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… ఎసన్న పుష్పరాజు అన్నదమ్ములు… వీరిద్దరి మధ్య ఇంటి స్థలం విషయంలో తరుచు గొడవ పడుతుండేవారు…

అయితే ఇదే క్రమంలో పుష్పరాజు భార్యతో ఏసన్న మరోసారి గొడవపడ్డాడు… ఒకరిపై ఒకరు తిట్టుకున్నారు… ఆసమయంలో ఏసన్న ఆగ్రహంతో ఊగిపోయి ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకుని పుష్పరాజు భార్య శ్రీలేఖపై దాడి చేశాడు దీంతో ఆమె రక్తపు మడుగులో అక్కడే కుప్పకులిపోయింది…

స్థానికులు ఆమెను ఆంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యమంలో ప్రాణాలు కోల్పోయింది… మృతురాలి భర్త పుష్ప రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు… పోస్ట్ మార్టం నిమిత్తం మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు…