పోలీస్ నియామకాల పై కేబినెట్ కీలక నిర్ణయం

0
113

తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగాల జాతర మొదలయిపోయింది. అంతేకాకుండా అభ్యర్థులకు అనుకూలంగా ఉండేలా వినూత్నమైన నిర్ణయాలు తీసుకొని అభ్యర్థులను ఆనందపరుస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 18,334 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్టు సీఎం తెలిపారు. అందుకే పోలీస్ అవ్వాలనే కోరిక ఉన్న అభ్యర్థులు ప్రిపరేషన్ మొదలు పెట్టే సమయం ఆసన్నమయిందని తెలిపారు.

తాజాగా ఈ పోస్టుల‌కు ప్రిపేర్ అయ్యే అభ్య‌ర్థుల‌కు ప్ర‌భుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు జరపబోతున్న నేపథ్యంలో పోలీస్ రిక్రూట్ మెంట్ కు సంబంధించి అభ్యర్థుల వయోపరిమితి అర్హతలో 3 సంవత్సరాలు సడలించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగార్థుల నుండి వచ్చిన అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.