బంజారాహిల్స్‌లో ఓ కారు బీభత్సం అందులో ఎవరున్నారంటే

బంజారాహిల్స్‌లో ఓ కారు బీభత్సం అందులో ఎవరున్నారంటే

0
113

కొందరు బడా బాబుల పిల్లలు లేదా వారే మత్తెక్కేలా తాగడం ఇష్టం వచ్చినట్టు కారులు నడపడం ఇలాంటికి కొందరు ఈ మధ్య చేస్తున్నారు .. పోలీసులకు కూడా ఇది పెద్ద సవాల్ గా మారుతోంది.. ఎన్నిసార్లు వేగం మద్యంతో కారు నడపద్దు అన్నా ఆ నిషా కైపం వారిని అలా డ్రైవ్ చేసేలా చేస్తోంది… తాజాగా నగరంలోని బంజారాహిల్స్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది.

గురువారం తెల్లవారుజామున ఏపీ 09 ఏపీ 0815 నెంబరు గల కారు అతివేగంతో వచ్చి రోడ్డు పక్కన పార్క్‌ చేసిన మరో కారును ఢీ కొట్టి.. ఫుట్‌ పాత్‌పైకి దూసుకెళ్లింది. దీంతో రోడ్లను శుభ్రం చేస్తున్న జీహెచ్‌ఎంసీ కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు.

కారులో ఉన్న ముగ్గురు యువకులను అత్తాపూర్‌కు చెందినవారిగా గుర్తించారు. అయితే వారు మద్యం మత్తులో వాహనం నడిపినట్టుగా స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అయితే ఎంతో మంది సెలబ్రెటీలు వారి పిల్లలు రాజకీయ నేతల వారసులు ఇలా ప్రాణాలు కోల్పోయారు అతి వేగం వద్దు అని చెబుతున్నా యువత వినిపించుకోవడం లేదు… న్యూ ఇయర్ వేడుకలకు నగరం సిద్దమవుతున్న వేళ జాగ్రత్తలు చాలా అవసరం అని చెబుతున్నారు పోలీసులు ..అయితే ప్రస్తుతం కారులోని యువకులు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది.