కారు విమానంగా మారిపోతే వీడియో చూడండి గొప్ప ఆవిష్కరణ

కారు విమానంగా మారిపోతే వీడియో చూడండి గొప్ప ఆవిష్కరణ

0
83

టెక్నాలజీ మనిషి కంటే వేగంగా పరుగులు పెడుతోంది, కొత్త అప్ డేట్స్ దూసుకుపోతున్నాయి, ఇప్పుడు మార్కెట్లో డ్రైవర్ లేని కార్లు కూడా వచ్చేస్తున్నాయి, అంతేకాదు నీటిలో నడిచే పడవలు మళ్లీ కారులా మారి నేరుగా రోడ్లపై రయ్యమంటున్నాయి, అంతేకాదు తాజాగా కొత్త ఆవిష్కరణలకు ప్రపంచంలో చాలా దేశాలు ముందుండి ఆవిష్కరణ చేసేవారికి ఊతం అందిస్తున్నాయి కూడా.

తాజాగా ఓ ఆవిష్కరణ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది, రోడ్లపై పరుగులు తీసే కార్లు రివ్వున గాల్లోకి ఎగురుతున్నాయి. స్లొవేకియాకు చెందిన క్లెయిన్ విజన్ అనే సంస్థ తాజాగా ఎగిరే కారును అభివృద్ధి చేసింది. దీని స్పెషాలిటీ ఏమిటి అంటే ఈ కారు రయ్యిమని రోడ్డుపై వెళుతుంది, అలాగే విమానంలా విచ్చుకుని ముందుకు వెళుతుంది.

ఎయిర్ కార్ పేరిట తయారుచేసిన ఈ హైబ్రిడ్ వాహనం వీడియో నెట్టింట వైరల్ అవుతోంది, చూపరులని నెటిజన్లను ఆకట్టుకుంటోంది,ఈ కారు బరువు 1,100 కిలోలు. ఇది 200 కిలోల బరువు మోయగలదు. ఇందులో ఇందనం నింపి 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు…క్లెయిన్ విజన్ సంస్థ 30 ఏళ్లు శ్రమించి ఈ ఎగిరే కారును తయారుచేసింది. త్వరలోనే మార్కెట్లోకి వస్తాయి.

మీరు ఈ కారు విమానం వీడియో చూడండి