దేవుడు మనుషులను ప్రేమించమని టెక్నాలజీని వాడుకోమని సృష్టించారు.. కానీ ఇందుకు వ్యతిరేకంగా మనుషులు ప్రవర్తిస్తున్నారు… వస్తువులను ప్రేమిస్తు మనుషులను వాడుకుంటున్నారు… చివరకు అదే టెక్నాలజీనే ప్రాణం తీస్తోంది… తాజాగా అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది.. ఒక యువకుడు తల్లిదండ్రులు సెల్ ఫోన్ ఇవ్వనందుకు కొంతుకోసుకుని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు…
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లాకుచెందిన నరేంద్ర అనే యువకుడు పాలిటెక్నిక్ చేస్తున్నాడు…కాలేజీలో స్మార్ట్ ఫోన్ కు అలవాటు పడి ఫోన్ లో గేమ్స్ ఆడేవాడు.. ఇంటిదగ్గర కూడా అలానే చేసేవాడు ఇటీవలే ఆ యువకుడుకి తలనొప్పి కళ్లు మండటంతో పేరెంట్స్ అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లారు…
ఫోన్ లో గేమ్స్ ఆడటంవల్లే అనారోగ్య సమస్య వచ్చింది డాక్టర్లు చెప్పారు డాక్టర్ల సూచన మేరకు తల్లిదండ్రులు నరేంద్రకు ఫోన్ ఇవ్వలేదు… ఈ క్రమంలో తనకు ఫోన్ ఇవ్వాలని చెప్పాడు కానీ ఇవ్వలేదు.. తనకు ఫోన్ ఇవ్వకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిడు అయినా కూడా వారు ఫోన్ ఇవ్వలేదు.. దీంతో నరేంద్ర బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు… ప్రస్తుతం నరేంద్ర ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు..
—