Breaking- కేంద్రం కీలక నిర్ణయం..అమ్మాయిల వివాహ వయస్సు పెంపు

0
78

అమ్మాయిల కనీస వివాహ వయసుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మాయిలకు 18ఏళ్లు నిండితేనే పెళ్లి చేయాలన్న చట్టం ప్రస్తుతం ఉండగా.. దానిని 21ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్​ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

2020 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమ్మాయి పెళ్లి వయసును 21 సంవత్సరాలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఏడాదిన్నర తర్వాత ఈ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పురుషులతో సమానంగా మహిళల వివాహ వయస్సు పెంచే ప్రతిపాదనకు అంగీకారం లభించింది.

పౌష్టికాహార లోపం నుంచి ఆడపిల్లలను రక్షించాలంటే వారికి సరైన సమయంలో పెళ్లి చేయాలని మోదీ సూచించారు. ప్రస్తుతం పురుషుల కనీస వివాహ వయస్సు 21.. మహిళల వ‌య‌సు 18 సంవత్సరాలు కల్పిస్తూ గ‌తంలో కేంద్రం చ‌ట్టం చేసిన సంగ‌తి తెలిసిందే. బాల్య వివాహాల నిషేధ చట్టం, ప్రత్యేక వివాహ చట్టం, హిందూ వివాహ చట్టంలో సవరణలు తీసుకొచ్చి దానికి ఒక రూపం ఇవ్వనున్నట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం

2020-21 బడ్జెట్ ప్రసంగంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటును ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్…’1978లో 1929 నాటి శారదా చట్టాన్ని సవరించి మహిళల వివాహ వయస్సును 15 సంవత్సరాల నుంచి 18ఏళ్లకు పెంచారు. దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు మహిళలు ఉన్నత శిఖరాలకు చేరుకునే ఛాన్స్‌ ఎక్కువగా ఉంటోంది. MMRని తగ్గించి, పోషకాహార అందివ్వగలిగితే అద్భుతాలు చేస్తారన్నారు.