ఛీ…. కన్న కూతురునే అత్యాచారం చేసిన తండ్రి…

ఛీ.... కన్న కూతురునే అత్యాచారం చేసిన తండ్రి...

0
169

సభ్యసమాజం తలదించుకునేలా కన్న తండ్రి తన కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డారు.. ఈ దారుణమైన సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది… అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. నెల్లూరు జిల్లా వింజమూరు పంచాయితీకి చెందిన ఒక వ్యక్తి తన కుమార్తెను ఉదయం బంధువుల ఇంటికి తీసుకువెళ్లాడు…

తిరిగి సాయంత్రం తీసుకువచ్చేందుకు ద్విచక్రవాహనంలో బంధువులు ఇంటికి వెళ్లాడు… సాయంత్రం అక్కడ మద్యం తాగి తన కూతురును బైక్ పై తీసుకువస్తున్నాడు…. అయితే మద్యం మత్తులో మార్గ మాద్యంలో తన కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడు…

ఉహించని సంఘటన చూసి షాక్ అయిన ఆమె తండ్రి చెర నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది… ఆ తర్వాత ఈ విషయం తన తల్లికి చెప్పింది… దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది…. పోలీసులు ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…