చీ…. పిల్లనిచ్చిన మామనే అతి దారుణంగా…

చీ.... పిల్లనిచ్చిన మామనే అతి దారుణంగా...

0
103

భార్య భర్తల మధ్య ఏర్పడిన గొడవల వల్ల ఒక వ్యక్తి పిల్లనిచ్చిన మామనే అతి దారుణంగా హత్య చేశాడు… ఈ సంఘటన నల్గొండ పట్టణంలో జరిగింది అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… కృష్ణా జిల్లా నందిగామ జిల్లాకు చెందిన చింతల గోపీకి గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన వెంకటలక్ష్మీకి గతంలో వివాహం అయింది…

దంపతులు ఇద్దరు భ్రతుకు దెరువు రిత్య నల్గొండ పట్టణంలో పాత సామాను సేకరణ విక్రయ వ్యాపారం చేస్తున్నారు… ఈ క్రమంలో భార్య భర్తల మధ్య గొడవలు తలెత్తాయి… ఇక వీరిమధ్య సయోధ్య కుదిర్చేందుకు వెంకటలక్ష్మి తండ్రి వెంకటేశ్వరు వచ్చాడు… రాత్రి మామ అల్లుడు ఫుల్ గా తాగారు… ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది…

దీంతో అల్లుడు గోపి కోపంతో మామను పక్కనే ఉన్న రోకలితో గట్టిగా కొట్టాడు… దీంతో అతను అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు… తీవ్ర రక్తస్రాయం అయిన తన తంని వెంకటలక్ష్మీ స్థానికులు సహాయంతో ఆసుపత్రికి తరలించారు… ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు… పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…