మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చెక్ చేసుకోండిలా..

0
100

ఇప్పుడు ఒక్కో పోన్ కి డ్యూయల్ సిమ్ ఆప్షన్ ఉంటుంది. మనం ఫోన్ మార్చినప్పుడల్లా కొత్త కొత్త సిమ్ తీసుకుంటాము. మన అవసరాలకు తగ్గట్టుగా మన నంబర్ లను తీసుకుంటూ ఉంటాం. అలా కొన్ని రోజులు వాడిన తర్వాత ఆ నంబర్ పక్కన పడేస్తారు. చాలామందికి పేర్లపై ఎన్ని సిమ్ కార్డులున్నాయో తెలుసుకోవాలనుకుంటారు. అయితే ఇలా చెక్ చేసుకోండి..

ముందుగా ఇంటర్నెట్ బ్రౌజర్‌లో https://tafcop.dgtelecom.gov.in/ లింక్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత అక్కడ మీ మొబైల్‌ నంబర్‌ను ఎంటర్ చేయాలి. మొబైల్‌కు ఓటీపీ వచ్చాక దాన్ని ఎంటర్ చేయండి. ఓటీపీ నమోదు చేశాక.. మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో అక్కడ కనిపిస్తుంది.

మొబైల్‌ నంబర్‌ కింద ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకవేళ ఆ నంబర్‌ మీది కాకపోయినా.. ఆ నంబర్‌ ఇక మీకు అవసరం లేకపోయినా అక్కడ ఉన్న ఆప్షన్లను ఎంచుకొని ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇలా మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు.