స్టూడెంట్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ ఇంటర్ ఫలితాలు నేడు విడుదల. ఈ మేరకు మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను https://bie.ap.gov.in/ వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు.
ఫలితాలు వెల్లడైన వెంటనే ఇంటర్ మార్క్స్ మెమో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. కాగా మే 6 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరగ్గా, రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.