ఛీ వీడు మనిషేనా… భార్యను అమ్మకానికి పెట్టిన భర్త….

ఛీ వీడు మనిషేనా... భార్యను అమ్మకానికి పెట్టిన భర్త....

0
108

భార్యంటే భర్తలో సగం అని భావిస్తారు అలాంటి భార్యను భర్త కంటికి రెప్పలా చూడాల్సిందిపోయినీచంగా ప్రవర్తించాడు భర్త ఈ సంఘటన యూపీలోని మెహ్ నగర్ పరిధిలోని తుథియా గ్రామంలో జరిగింది… పునీత్ అనే వ్యక్తికి కొత్వాలీకి చెందిన యువతికి సంవత్సరం క్రితం వివాహం అయింది.. అయితే వివాహసమయంలోపునీత్ కు కట్న కానుకలతో పాటు బైక్ కూడా ఇప్పిస్తామని చెప్పారు..

అయితే పెళ్లి అయి సంవత్సరం అయినా కూడా బైక్ కొనివ్వలేదు… దీంతో ఆగ్రహించిన పునీత్ భార్యను కొద్దికాలంగా వేధిస్తున్నాడు.. ఈ వేధింపులు రోజు రోజుకు ఎక్కువ అవుతుండటంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది… దీంతో ఆగ్రహించిన పునీత్ భార్య ఫోటోలు ఫోన్ నంబర్ ను ఫేస్ బుక్ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాడు…

తనకు డబ్బులు చెల్లించి ఆమెతో గడపచ్చని అందులో రాశాడు… దీంతో ఆమెకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు… వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తే ఆ పోస్ట్ చేసింది భర్తే అని తేలిసింది.. దీంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు…