తిరుమలలో చిరుత టెన్షన్..భక్తులను అప్రమత్తం చేసిన భద్రతా సిబ్బంది

Cheetah tension in Thirumala..Security personnel alerted the devotees

0
152

తిరుగిరుల్లో సంచరించే వన్యప్రాణులు కనుమదారుల్లో కనిపిస్తున్నాయి. తిరుమల కనుమదారిలో చిరుతపులి భక్తులకు కనిపించింది. దీనితో భక్తుల్లో టెన్షన్ నెలకొంది. ఎగువ కనుమదారిలో హరిణికి సమీపంలో రహదారి పక్కనున్న పట్టి గోడపై తిష్టవేసింది. చిరుతను గమనించిన ప్రయాణికులు వాహనాన్ని నిలిపారు. వాహనాల అలికిడికి చిరుత అక్కడినుంచి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది భక్తులను అప్రమత్తం చేశారు. కనుమ దారుల్లో వాహనాల నుంచి ఎక్కడా కిందికి దిగవద్దని హెచ్చరించారు.